ప్రాజెక్టులపై తెలంగాణ పిటిషన్.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
- కృష్ణా నది ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్
- సుప్రీంకోర్టులో విచారణ
- రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు
కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.