ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఏపీకి కేటాయించండి: క్యాట్ ఆదేశాలు
- విభజన సమయంలో తెలంగాణకు శివశంకర్ కేటాయింపు
- తాను ఏపీకి చెందినవాడ్నే అన్న శివశంకర్
- న్యాయపోరాటం అనంతరం భారీ ఊరట
- చంద్రబాబు ప్రయత్నాలతో సానుకూల ఫలితం
కొన్నాళ్ల కిందట ఐఏఎస్ అధికారి శివశంకర్ సీఎం చంద్రబాబును కలిశారు. తన సొంత రాష్ట్రం ఏపీ అని, కానీ పోస్టింగ్ సమయంలో తాత్కాలిక చిరునామా కింద హైదరాబాద్ అని పేర్కొన్నానని చంద్రబాబుకు వివరించారు. స్థానికతను పరిగణనలోకి తీసుకుని తనను ఏపీలో కొనసాగేలా చూడాలని కోరారు.
శివశంకర్ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు... కేంద్రంతో మాట్లాడారు. ఈ క్రమంలోనే, శివశంకర్ ను ఏపీకి కేటాయించేలా చర్యలు తీసుకోవాలంటూ క్యాట్ తాజాగా డీవోపీటీకి ఆదేశాలు జారీ చేసింది.