పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి ఆసక్తికర సమాధానాలు!
- అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారిస్తున్న పోలీసులు
- ఏడు గంటలుగా పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న పోలీసులు
- తెలియదు, గుర్తులేదు, లవ్యూ రాజా అంటూ సమాధానాల దాటవేత
పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్లు సమాచారం. తనకు తెలియదని, గుర్తులేదని, అవునా అంటూ సమాధానాలు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలను చూపిస్తూ ప్రశ్నించినా, 'లవ్ యూ రాజా' అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.