మంచు మనోజ్‌పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌తో మోహన్ బాబు ఏమన్నారంటే?
- కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపై ఎవరికీ హక్కు లేదన్న మోహన్ బాబు
- మనోజ్ నా ఆస్తులు నాకు అప్పగించాలని స్పష్టీకరణ
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరైన మోహన్ బాబు, మనోజ్
ఈ ఫిర్యాదు విచారణ క్రమంలో, ఈరోజు మోహన్ బాబు, మంచు మనోజ్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఆస్తి తగాదాలకు సంబంధించిన వివరాలను అందించారు. దాదాపు రెండు గంటల పాటు జిల్లా మేజిస్ట్రేట్ ఇద్దరినీ విచారించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, తన ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని, ఆస్తులను మనోజ్ అప్పగించాలన్నారు. అనంతరం, వచ్చేవారం మరోసారి విచారణకు హాజరుకావాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.