రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట
- ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
- హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
ప్రభావతి పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. అయితే విచారణకు సహకరించాలని ప్రభావతిని ఆదేశించింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.