కేటీఆర్, హరీశ్ రావు నా కాలిగోటికి కూడా సరిపోరు: కోమటిరెడ్డి
- కేటీఆర్ ఒక పనికిమాలిన వ్యక్తి అన్న కోమటిరెడ్డి
- ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు కొట్టుకుంటున్నారని విమర్శ
- కేసీఆర్ మాదిరి తాను ఎలెక్షన్, కలెక్షన్ చేయలేదని వ్యాఖ్య
ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు కొట్టుకుంటున్నారని కోమటి రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ మాదిరి తాను ఎలెక్షన్, కలెక్షన్ చేయలేదని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారో, రారో? చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా... లేక, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారా? అని ప్రశ్నించారు. గద్దర్ కు అవార్డ్ ఇస్తే తప్పేముందని అన్నారు.