నడకలో వేగంతో మధుమేహం, గుండె జబ్బులు దూరం!
- జపాన్‌లోని దోషిషా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- స్థూలకాయంతో బాధపడుతున్న 25 వేల మందిపై పరిశోధన
- వేగంగా నడిస్తే గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వ్యవస్థ పనితీరు మెరుగు
వేగంగా నడిచే వారిలో డయాబెటిస్ ముప్పు 30 శాతం తక్కువైనట్టు అధ్యయనకారులు గుర్తించారు. హైపర్ టెన్షన్, రక్తంలో అసాధారణ లైపోప్రొటీన్ లెవల్స్ (డిస్లీపిడీమియా) ముప్పు కూడా చాలా తక్కువని తేలింది. నడక వేగానికి, సమగ్ర ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. వేగంగా నడిచే వారిలో గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. ఇది మెరుగ్గా ఉంటే జీవక్రియకు సంబంధించిన వ్యాధుల ముప్పు దూరంగా ఉంటుందని పరిశోధకులు వివరించారు.