'పుష్ప-2' కలెక్షన్ల సునామీ.. నాలుగో రోజే రూ. 800కోట్ల క్లబ్‌లోకి!
- ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'పుష్ప-2'
- నాలుగో రోజే వసూళ్లు రూ. 800కోట్లు దాటాయన్న సినీ విశ్లేషకుడు రమేశ్ బాల
- తెలుగు కంటే హిందీలోనే మూవీకి భారీ వసూళ్లు
- మొదటి వారాంతంలోనే కలెక్షన్లు రూ. 1000 కోట్లు దాటడం ఖాయమంటున్న ట్రేడ్ వర్గాలు
ఇక హిందీ వెర్షన్‌లో ఈ సినిమా వసూళ్ల పరంగా కుమ్మేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మొదటి వారాంతంలోనే పుష్ప-2 కలెక్షన్లు రూ. 1000 కోట్లు దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, శాక్‌నిల్క్ ప్రకారం ఆదివారం ఈ మూవీ మొత్తంగా రూ. 141.5 కోట్లు రాబట్టింది. ఇందులో హిందీ నుంచే ఏకంగా రూ. 85కోట్లు రావడం విశేషం.
అలాగే తెలుగు నుంచి రూ. 44 కోట్లు, తమిళం రూ. 9.5కోట్లు, మలయాళం రూ. 1.9కోట్లు, కన్నడ నుంచి రూ. 1.1 కోట్లు వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా నెట్ కలెక్షన్లు రూ. 529.45కోట్లకు చేరాయి. ఇందులో హిందీ వెర్షన్ నుంచి రూ. 285.7కోట్లు రావడం గమనార్హం. సో.. పూర్తి రన్‌టైంలో ఈ సూపర్ సీక్వెల్ వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.