పుష్ప2పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర స్పందన
- పుష్ప అంటే వైల్డ్‌ఫైర్ కాదన్న అంబటి
- పుష్ప అంటే వరల్డ్ ఫైర్ అంటూ ప్రశంసలు
- ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆసక్తికర స్పందన
పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘పుష్ప అంటే వైల్డ్‌ఫైర్ అనుకుంటివా. కాదు. వరల్డ్ ఫైర్’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు. తన ట్వీట్‌కు ఫైర్ ఎమోజీని ఆయన జోడించారు. సినిమా విడుదలైన నేపథ్యంలో ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
కాగా పుష్ప2పై కొందరు పనిగట్టుకొని కుట్రలు చేస్తున్నారంటూ రెండు వారాలక్రితం అంబటి రాంబాబు అన్నారు. కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ అడ్డుకోలేరని సవాలు చేశారు. అల్లు అర్జున్ ఒక ఇంటర్నేషనల్ స్టార్ అని అంబటి ప్రశంసల జల్లు కురిపించారు. తాను కూడా పుష్ప2 సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నానంటూ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.