సచిన్ రికార్డును బద్దలుగొట్టిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్
- న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
- రూట్‌కు ఇది 150వ టెస్ట్ మ్యాచ్
- నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత
1,625 పరుగులతో సచిన్ ఇప్పటి వరకు ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండగా రూట్ 1,630 పరుగులతో అతడిని అధిగమించాడు. అలిస్టర్ కుక్, గ్రేమ్ స్మిత్ చెరో 1,611 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. వెస్టిండీస్ గ్రేట్ శివ్‌నరైన్ చందర్‌పాల్ 1,580 పరుగులతో టాప్-5లో ఉన్నాడు.