ఒకే వేదికపైకి నయనతార, ధనుశ్.. నెట్టింట వీడియో వైరల్!
- టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహం
- ఒకే వేదికపై ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచిన నయనతార, ధనుశ్
- వీడియోను షేర్ చేసిన నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్
టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహ వేదికపై ఇలా నయన్, ధనుశ్ ప్రత్యక్షమయ్యారు. గురువారం ఆకాశ్ భాస్కర్ పెళ్లికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి వచ్చారు.
ఇక సినీ పరిశ్రమకు చెందినవారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుశ్, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుశ్ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు.
ఈ వీడియోను నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇరువురు అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
నయనతార, ధనుశ్ మధ్య వివాదం ఇదే..
నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ‘నేనూ రౌడీనే’ అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్‌ను వాడారు. ఈ సినిమాకి ధనుశ్ నిర్మాత. అయితే, తన అనుమతి లేకుండా ఆ క్లిప్పింగ్‌ను వాడారని కోప్పడిన ధనుశ్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపారు. తాము ధనుశ్ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం రెండేళ్లపాటు ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదంటూ నయనతార ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.
More Telugu News
అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్!
![]()
మమతా బెనర్జీకి బిగ్ షాక్: ఎన్డీయే కూటమికి 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు!
![]()
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు... నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు
![]()
రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు
![]()
మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
![]()
పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
![]()
అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
![]()
భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
![]()
పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్
![]()
ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం!
![]()
టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
![]()
పండ్లలో రారాజు.. ఆరోగ్యానికి కూడా మహారాజే!
![]()
సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్
![]()
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు!
![]()
స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
![]()