సాయి పల్లవి క్రేజ్ మామూలుగా లేదు!
- అమరన్ చిత్రంలో అలరిస్తున్న సాయి పల్లవి
- అమరన్‌లో ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి
- అమరన్‌కు మంచి ప్రారంభ వసూళ్లు
ఈ కోవలోనే ఆమె నటించగా.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన తాజా చిత్రం 'అమరన్'. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్ద పబ్లిసిటి, హడావుడి లేకుండా సైలెంట్‌గా థియేటర్‌లో విడుదలైన అమరన్‌కు తెలుగులో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు ఎవరూ ఊహించని ప్రారంభ వసూళ్లు రావడం విశేషం. అయితే ఇదంతా సాయి పల్లవి క్రేజ్‌కు నిదర్శనం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఈ చిత్రంలో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి తన నటనతో అందరినీ ఆకట్టుకుందని అంటున్నారు, అమరన్ చిత్ర కథ కూడా సాయి పల్లవి కోణంలోనే కొనసాగుతుందట. ఈ చిత్రంలో సైనికుడి భార్యగా ఆమె నటనకు అందరూ అభినందనలను చెబుతున్నారు. కేవలం సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ వల్లే ఈ చిత్రానికి ప్రారంభ వసూళ్లు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే నాగచైతన్యతో ఆమె కలిసి నటించిన తండేల్ చిత్రం కూడా విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో కూడా ఆమె పాత్రను దర్శకుడు చందు మొండేటి డిజైన్ చేసిన విధానం అందర్ని ఆకట్టుకుంటుందని సమాచారం.