వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన స్థలాల్లో సోదాలపై ఈడీ ప్రకటన
- ఇటీవల విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన స్థలాల్లో ఈడీ సోదాలు
- ఐదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామన్న ఈడీ
- రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై వివరణ
రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొంది. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని, ఆ భూమిని మోసపూరితంగా అన్యాక్రాంతం చేశారని ఈడీ వివరించింది. అరిలోవ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.