నాగచైతన్య, శోభిత పెళ్లి పనులు షురూ
- సమంతతో విడిపోయిన తర్వాత శోభిత ప్రేమలో నాగచైతన్య
- ఆగస్టు 8న జరిగిన ఎంగేజ్ మెంట్
- డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న వివాహం
సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభితలు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీంతో, ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ వార్తలు నిజమేనని నిరూపిస్తూ... గత ఆగస్టు 8న వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో నాగార్జున షేర్ చేశారు.