కేజీఎఫ్ నిర్మాత అందిస్తున్న మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'
- బఘీరకు కథ అందించిన ప్రశాంత్‌నీల్
- థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బఘీర
- అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు బఘీర
'బఘీర' చిత్రం థ్రిల్లింగ్ యాక్షన్ ఏపిసోడ్స్‌తో, ఆకట్టుకునే విజువల్స్‌తో ఉండబోతుందని, హీరో శ్రీమురళి పాత్ర ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేసే విధంగా ఉంటుందని నిర్మాత అంటున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ తెలుగులో విడుదల చేస్తుంది.
రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఏజే శెట్టి డీవోపీ కాగా, కాంతార ఫేమ్ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.