Bhumika: గుణశేఖర్‌ 'యుఫోరియా' చిత్రంలో భూమిక చావ్లా

Bhumika Chawla in Gunasekhars Euphoria

  • 21 ఏళ్ళ తరువాత గుణశేఖర్‌ చిత్రంలో నటిస్తున్న భూమిక 
  • గుణశేఖర్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'యుఫోరియా' 
  • కీలక పాత్రలో భూమిక చావ్లా 

తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా భూమిక చావ్లాది ఓ ప్రత్యేకస్థానం. ముఖ్యంగా మహేష్‌బాబు ఒక్కడు, పవన్‌కల్యాణ్‌ ఖుషి చిత్రాల్లో తన నటన, గ్లామర్‌తో భూమిక యువత హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత 2017లో నాని చిత్రం ఎంసీఏలోనూ కీలక పాత్ర పోషించింది. కొంత కాలం నుండి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యుఫోరియా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.  

తాజాగా ఆమె ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను తన సోషల్‌మీడియా అకౌంట్‌లో షేర్‌ చేయడంతో ఆమె యుఫోరియా చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె అభిమానులు కన్‌ఫర్మ్‌ చేసుకుంటున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ సరసన నటించిన బటర్‌ఫ్లై చిత్రం తరువాత భూమిక యాక్ట్‌ చేసిన ఏ చిత్రం తెలుగులో విడుదల కాలేదు. సమంతతో శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించిన తరువాత గుణశేఖర్‌ కొంత విరామం తీసుకుని యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా యూఫోరియా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం టీజర్‌ నేడు విడుదల కానుంది. 

నీలిమ గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ విభిన్న ఎంటర్‌టైనర్‌ గురించి, ఈ చిత్రంలో నటీనటుల గురించి టీజర్‌ విడుదల తరువాత క్లారిటీ వచ్చే అవకాశం వుంది. 2003లో మహేష్‌బాబు, భూమిక కలయికలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ఒక్కడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం తరువాత దాదాపు 21 ఏళ్ల విరామం తరువాత గుణశేఖర్‌ చిత్రంలో భూమిక నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News