నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ కామెంట్లు విని షాక్ అయ్యాను: రామ్ గోపాల్ వర్మ
- కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగచైతన్య విడాకుల అంశం ప్రస్తావించిన కొండా సురేఖ
- తీవ్రస్థాయిలో విమర్శలు
- నాగ్ కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగడం భరించరాని విషయమన్న వర్మ
తాజాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశంపై తన బాణీ వినిపించారు. నాగార్జున కుటుంబాన్ని కొండా సురేఖ అత్యంత దారుణంగా అవమానపర్చిందని పేర్కొన్నారు. కొండా సురేఖ కామెంట్లు విని తాను షాక్ అయ్యానని వర్మ వెల్లడించారు.
తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి అత్యంత గౌరవనీయ నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగడం ఏమాత్రం భరించరాని విషయం అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు.