Jhansi Reddy: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి తీవ్రగాయాలు

MLA Yashaswini aunt Jhansi Reddy seriously injured after stage collapsed at Torrur

  • షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలిన ఘటనలో గాయాలు
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఘటన
  • ఝాన్సీరెడ్డిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆమె ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో, ఝాన్సీరెడ్డిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News