కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందన
- విడాకులు తన వ్యక్తిగత విషయమన్న సమంత
- విడాకుల విషయంలో రాజకీయ ప్రమేయం లేదని వ్యాఖ్య
- తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని విన్నపం
ఇతర వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని తాను కోరుతున్నానని సమంత చెప్పారు. తన విడాకులు సామరస్యపూర్వకంగా జరిగాయని... అందులో రాజకీయ ప్రమేయం లేదని అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటానని... తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నానని చెప్పారు.