కేటీఆర్, హీరోయిన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలు... స్పందించిన ప్రకాశ్ రాజ్
- నాగచైతన్య-సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమన్న కొండా సురేఖ
- హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశాడని మంత్రి ఆరోపణలు
- సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? అని ప్రకాశ్ రాజ్ ట్వీట్
నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని, చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డు నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఆరోపించారు. వారితో కలిసి రేవ్ పార్టీలు చేసుకొని, మదమెక్కి... వారి జీవితాలతో ఆడుకున్నారని, ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేశారని విమర్శించారు. ఈ విషయం సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.