Nani: నెట్ ఫ్లిక్స్ తెరపైకి 'సరిపోదా శనివారం'!

Saripoda Shanivaram Movie OTT Release Date Confirmed

  • ఆగస్టు 29న విడుదలైన సినిమా 
  • నాని జోడీగా కనిపించిన ప్రియాంక అరుళ్ మోహన్
  • కథాకథనాల పరంగా మంచి మార్కులు 
  • ఈ నెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్   


నాని నుంచి ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'సరిపోదా శనివారం'. డీవీవీ దానయ్య - కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. కథాకథనాల పరంగా ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అదే రోజులలో వచ్చిన వరదల ప్రభావాన్ని ఈ సినిమా తప్పించుకోలేకపోయింది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నాని జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించింది. ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య మెప్పించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. 

ఈ సినిమాలో హీరోకి కోపం ఎక్కువ. 6 రోజులలో ఏం జరిగినా కోపాన్ని అణచుకుని, శనివారం నాడు దానిని ప్రదర్శించమని తల్లి చెబుతుంది. 6 రోజులలో అతని కోపం తగ్గిపోతే అవతలవారిని ఎప్పటికీ క్షమించమని అంటుంది. దాంతో హీరో తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని ఫిక్స్ చేసుకుంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కథ.

  • Loading...

More Telugu News