మహేశ్ బాబు వెరీ లేటెస్ట్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా!
- న్యూ లుక్‌లో మహేశ్ బాబు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్
- రాజమౌళి సినిమాలో ఇదే లుక్ అంటూ ఊహగానాలు
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇండియానా జోన్స్ నేపథ్యంలో వుంటుందని ఇటీవల రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మహేశ్ లుక్‌పై రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే మహేశ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల కోసం రూ. 50 లక్షలు, ఏఎంబీ సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షల విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో ఆయనను కలిసి చెక్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మహేశ్ తో పాటు ఆయన సతీమణి నమ్రత కూడా వున్నారు. మహేశ్, రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో లాంగ్ హెయిర్, గడ్డం, వైట్ ఫుల్‌హ్యాండ్ టీషర్ట్‌లో కనిపిస్తున్న మహేశ్ బాబును చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ హీరో రాజమౌళి సినిమాలో ఇదే లుక్‌లో కనిపించబోతున్నాడని చర్చించుకుంటున్నారు.