వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు
- సీజనల్ వ్యాధుల నియంత్రణపై అధికారులతో మంత్రి సమీక్ష
- అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశం
- వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించిన మంత్రి సత్యకుమార్
అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రతపైనా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ, వాడకంపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ హాస్టల్ లో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.