డైరెక్టర్ వీవీ వినాయక్ కు మేజర్ లివర్ సర్జరీ
- కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న వినాయక్
- ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో వినాయక్ కు శస్త్రచికిత్స
- ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ కూడా చేయని స్టార్ డైరెక్టర్
రాయదుర్గంలో కొన్నేళ్ల క్రితం ఆయన ఒక భారీ బంగ్లాను నిర్మించుకున్నారు. ఇటీవలే దాన్ని అమ్మేసి... కోకాపేట్ లో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వినాయక్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
చివరిగా 'ఛత్రపతి' సినిమాను ఆయన హిందీలోకి రీమేక్ చేశారు. సాయి శ్రీనివాస్ హీరోగా తెరక్కిన ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. అయితే, ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.