Varun Tej: చిరు బ‌ర్త్‌డే వేళ ఆస‌క్తిక‌ర ఫొటోల‌ను షేర్ చేసిన వ‌రుణ్ తేజ్

Varun Tej Share Interesting Photos of Chiranjeevi on his Birthday

  • నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన‌రోజు
  • సోషల్ మీడియా వేదిక‌గా చిరుకు వెలువెత్తుతున్న బ‌ర్త్‌డే విషెస్‌
  • పెద‌నాన్న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మెగా ప్రిన్స్‌
  • చిరుతో దిగిన‌ త‌న చిన్న‌నాటి ఫొటోల‌ను షేర్ చేసిన వ‌రుణ్‌

నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా వివిధ ప్రాంతాల్లోని మెగా అభిమానులు చిరు బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే సోష‌ల్ మీడియా వేదిక‌గా చిరుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అభిమానుల‌తో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా చిరంజీవికి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. 

తాజాగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ కూడా పెద‌నాన్న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆస‌క్తిక‌ర ఫొటోల‌ను పంచుకున్నాడు. అందులో వ‌రుణ్ చిన్న‌ప్పుడు చిరు కాళ్ల‌ మీద ప‌డి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటో కూడా ఉంది. ఆ ఫొటోలో మెగాస్టార్ తండ్రి వెంక‌ట్రావు కూడా ఉన్నారు. అలాగే మ‌రో ఫొటోలో మెగా ప్రిన్స్ త‌న పెళ్లి స‌మ‌యంలో చిరును ఆలింగ‌నం చేసుకోవ‌డం క‌నిపించింది. 

త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఇంట్రెస్టింగ్ ఫొటోల‌ను వ‌రుణ్ షేర్ చేశాడు. ఈ ఫొటోల కింద 'పెద‌నాన్న ఏ స‌మ‌స్య వ‌చ్చిన చిరున‌వ్వుతో ఎదుర్కోమ‌ని నేర్పించారు. ప్రేమ‌, అనుబంధాల‌తో మ‌మ్మ‌ల్ని పెంచినందుకు మీకు ధ‌న్య‌వాదాలు. మీరే నా అతి పెద్ద ఆద‌ర్శం. హ్యాపీ బ‌ర్త్‌డే డాడీ' అని రాసుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

  • Loading...

More Telugu News