Kalki 2898 AD: బాలీవుడ్ రికార్డును తుడిచిపెట్టేసిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'

Kalki 2898 AD beats Shah Rukh Khan Jawan to become fourth  highest grossing film in India

  • భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన‌ నాలుగో చిత్రంగా 'క‌ల్కి'
  • బాహుబ‌లి2, కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ త‌ర్వాతి స్థానంలో ప్రభాస్ మూవీ
  • 'జవాన్' మూవీ ఫుల్ ర‌న్‌టైంలో రూ. 640.25 కోట్లు వ‌సూలు
  • ఇప్ప‌టివ‌ర‌కు రూ. 640.30 కోట్లు రాబ‌ట్టిన‌ 'క‌ల్కి'

యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'కల్కి 2898 ఏడీ' క‌లెక్షన్ల సునామీ కొనసాగుతోంది. వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పటికే ఈ ఏడాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది కూడా. అలాగే ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబ‌ట్టిన‌ విదేశీ చిత్రంగాను మారింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన‌ నాలుగో చిత్రంగాను అవ‌త‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ స్థానంలో ఉన్న‌ షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని వెన‌క్కి నెట్టేసింది.

ఇక భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూల్లు కొల్ల‌గొట్టిన 'బాహుబ‌లి2', 'కేజీఎఫ్2', 'ఆర్ఆర్ఆర్' త‌ర్వాత నాలుగో స్థానంలో 'క‌ల్కి..' ఉంది. అంత‌కుముందు ఈ స్థానంలో ఉన్న 'జ‌వాన్' మూవీ రూ. 640.25 కోట్లు వ‌సూలు చేయ‌గా.. క‌ల్కి ఇప్ప‌టివ‌ర‌కు రూ. 640.30 కోట్లు రాబ‌ట్టింది. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం షోల నుండి రూ. 15 లక్షలు వ‌సూలు చేయ‌డంతో ఈ చిత్రం క‌లెక్ష‌న్లు రూ. 640.30 కోట్లకు చేరాయి. దీంతో భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డుకెక్కింది.

కాగా, ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల మార్క్‌ను దాటిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా అభిమానుల కోసం మేకర్స్ ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. ఈ నెల‌ 2 నుండి 9 వరకు కేవలం 100 రూపాయలకే టిక్కెట్‌లను విక్రయించనున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News