సీరియల్ కిల్లర్ గా మాధురీ దీక్షిత్!
- నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో మిస్టర్ దేశ్ పాండే
- సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో వెబ్ సిరీస్
- త్వరలో చిత్రీకరణ ప్రారంభం
మిస్టర్ దేశ్ పాండే కథాంశం విషయానికొస్తే... ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులో మరో సీరియల్ కిల్లర్ సహకారం తీసుకుంటారు. ఓ ఫ్రెంచ్ వెబ్ సిరీస్ కు రీమేక్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఒకట్రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనం వెలువడింది. ఇందులో మాధురీ దీక్షిత్ సీరియల్ కిల్లర్ రోల్ లో ఎలా నటిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
మాధురి ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ నటిస్తున్న భూల్ భులాయియా-3లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.