మళ్లీ తడబడిన బైడెన్.. డెమోక్రాట్లలో టెన్షన్
- ట్రంప్ పై దాడి నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ ప్రసంగం
- విభేదాలను బ్యాటిల్ బాక్సుల్లో పరిష్కరించుకుంటామన్న బైడెన్
- బ్యాలెట్ కు బదులు బ్యాటిల్ అంటూ తడబడిన వైనం
తాజాగా ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండిస్తూ.. బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్ బాక్సును నమ్ముతాం. ఇప్పుడు కూడా మేం వాటిని బ్యాటిల్ బాక్సుల్లోనే పరిష్కరించుకొంటాం.. బుల్లెట్లతో కాదు’’ అని బైడెన్ అన్నారు. బ్యాలెట్ బాక్సులు అనాల్సిన చోట బ్యాటిల్ (యుద్ధం) బాక్సుల్లో పరిష్కరించుకుంటామని బైడెన్ పలకడంతో ఆయన సహాయకులు తలలు పట్టుకొన్నారు. అంతకు కొన్ని రోజుల ముందు కూడా నాటో సదస్సులోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పట్టుకుని పుతిన్ అని సంబోధించారు. డొనాల్డ్ ట్రంప్ ను అమెరికా వైస్ ప్రెసిడెంట్ అని బైడెన్ పేర్కొన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బైడెన్ ఆరోగ్య పరిస్థతిపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.