ఘంటసాల అల్లుడు ఓ పాప్యులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలుసా?
- కెమెరా ముందుకు వచ్చిన ఘంటసాల అల్లుడు
- బాలనటుడిగా చేసిన సినిమాలు 50కి పైగా
- నటన పట్ల ఆసక్తి లేదని చెప్పిన సురేంద్ర
- చెన్నెలోని శ్రీమంతులలో ఆయన ఒకరు
సురేంద్ర పాప్యులర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణ సినిమాలలో ఆయన నటించారు. 'బాలమిత్రుల కథ' సినిమాలో 'గున్నమామిడి కొమ్మమీద' పాట ఆయనపై చిత్రీకరించినదే. ఆ పాటలో ముద్దుగా బొద్దుగా అమాయకంగా కనిపించే ఆ కుర్రాడే ఈ సురేంద్ర. ఘంటసాల చనిపోయే సమయానికి ఆయన వయసు 13.
"మొదటి నుంచి కూడా నాకు సినిమాలలో నటించడమంటే ఇష్టం వుండేది కాదు. మా అమ్మగారి కోసం నటించాను. నేను హీరోను కావాలని మా అమ్మగారికి ఉండేది .. కానీ నాకు ఆ వైపు ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. అంతకుముందు ఘంటసాల గారి కుటుంబంతో మాకు చుట్టరికం లేదు. ఆ తరువాత కాలంలో ఘంటసాల గారి అమ్మాయి .. నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము" అని చెప్పారు.