ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు
- ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ
- క్రీడాకారుల కోసం సమయం కేటాయింపు
- చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాడ్మింటన్ క్రీడ తీరుతెన్నుల గురించి తెలుసుకున్నారు. క్రీడలకు తాము ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. మెరుగైన క్రీడా విధానాలతో ప్రతిభావంతులను తెరపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.