Sudheer Babu: 'సుధీర్ బాబు' హీరోగా సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌!

Sudheer Babu Upcoming Movie Update

  • సుధీర్ బాబు హీరోగా మరో సినిమా 
  • మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకుడిగా వెంకట్ కల్యాణ్ పరిచయం 
  • రంగంలోకి బాలీవుడ్ హీరోయిన్


వైవిధ్య‌మైన చిత్రాల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోన్న క‌థానాయ‌కుడు సుధీర్ బాబు. న‌వ ద‌ళ‌ప‌తిగా అభిమానుల మ‌న్న‌న‌లు అందుకుంటున్న ఆయ‌న, ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నారు. ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంద‌నుంది. ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించనుంది. వెంకట్ కల్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. 

'ప్రేర‌ణ అరోరా' స‌మ‌ర్ప‌ణ‌లో ఇప్పుడు సుధీర్ బాబు చేయ‌బోతున్న సినిమా పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. మేక‌ర్స్ ఆ వివ‌రాల‌ను త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చిలో విడుద‌ల చేయ‌నున్నారు. చెడుకి, మంచికి జ‌రిగే యుద్ధంగా ఇది తెర‌కెక్క‌నుంది.

ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ నాకు న‌చ్చడంతో ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సులకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.


  • Loading...

More Telugu News