నాకు ఆశ్చర్యంగా ఉంది... 'కల్కి' వసూళ్ల గురించి చాలా మంది అలా అడుగుతుంటే!: నిర్మాత స్వప్న దత్
- ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో 'కల్కి 2898 ఏడీ'
- మూవీకి ప్రీమియర్ షో నుంచే హిట్‌టాక్
- ఈ చిత్రం తొలిరోజు భారీ వసూళ్లు సాధించిందంటూ కథనాలు
- రికార్డులు తిరగరాసిందంటూ వార్తలు
- ఈ నేపథ్యంలో నిర్మాత స్వప్న దత్ 'ఎక్స్'లో ఆసక్తికర పోస్ట్
"నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా మంది రికార్డ్స్ క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే రికార్డులు సృష్టించిన వారెవరు కూడా ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమాపై ప్రేమతో చిత్రాలను చేస్తారు. మేము కూడా అలాగే తీశాం" అంటూ ఆమె రాసుకొచ్చారు. దీంతో ఈపోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.