సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే హోంశాఖ... శాంతిభద్రతలు ఎక్కడ?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన
- కేసీఆర్ హయాంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని వెల్లడి
- నేరాల నియంత్రణకు సీఎం సమీక్ష జరుపుతున్నారా? అని ప్రశ్న
తెలంగాణలో ఇప్పుడు ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో దాడులు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు లేకుండాపోయాయని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. అచ్చంపేట జిల్లాలో శ్రీధర్ రెడ్డి హంతకులు దొరికే వరకు తాము పోలీసులను వదిలేది లేదన్నారు.