మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి నేను కూడా వస్తున్నా: రజనీకాంత్
- సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
- నేడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ
- దాదాపు 8 వేల మంది అతిథుల నడుమ ప్రమాణస్వీకారం
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రజనీకాంత్ ను మీడియాతో పలకరించింది. తాను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నానని వెల్లడించారు. ఇది చారిత్రాత్మక ఘట్టం అని రజనీకాంత్ అభివర్ణించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న నరేంద్ర మోదీ గారిని అభినందిస్తున్నానని తెలిపారు.