Dalai Lama: వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా

Dalai Lama travelling to US for medical treatment

  • మోకాలి చికిత్స కోసం దలై లామా అమెరికా వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం ప్రకటన
  • ఈ పర్యటనలో దలై లామా మీడియా, ఇతర సమావేశాల్లో పాల్గొనరని వెల్లడి
  • అమెరికా నుంచి తిరిగొచ్చాక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటన

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా ఈ నెలలో అమెరికా వెల్లనున్నారు. మోకాలి చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తరువాత దలై లామా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎటువంటి మీడియా సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనరు. తిరిగి ధర్మశాలకు తిరిగొచ్చాక యాథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2017 జూన్ లో చివరి సారిగా దలై లామా అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన పలు సమావేశాల్లో పాల్గొనడంతో పాటు రోచెస్టర్ లోని మయో క్లినిక్ లో జనరల్ చెకప్ చేయించుకున్నారు.

  • Loading...

More Telugu News