బాలకృష్ణ ముఖ్య అతిథిగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- విష్వక్ హీరోగా రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
- ఆయన మార్క్ మాస్ కంటెంట్ తో వస్తున్న సినిమా
- విష్వక్ జోడీగా సందడి చేయనున్న నేహా శెట్టి
- ఈ నెల 31వ తేదీన ఈ సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. హైదరాబాద్ - మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో రేపు ఈ వేడుకను నిర్వహించనున్నారు. బాలకృష్ణ ముఖ్య అతిథిగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
మాస్ ఆడియన్స్ లో విష్వక్ కి మంచి ఇమేజ్ ఉంది. అందుకు తగిన విధంగానే ఇసుక మాఫియా నేపథ్యంలో ఈ కథను రాసుకున్నారు. మాటలు .. పాటలు కూడా విష్వక్ మార్క్ లోనే ఉంటాయి. యూత్ లో నేహా శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ జోడీగా గట్టిగానే సందడి చేస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.