పైరవీ చేసి పదవి తెచ్చుకోవడానికి మాది కాంగ్రెస్ పార్టీ కాదు: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి
- తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే తాను సీఎంను కలిశానని వెల్లడి
- పౌరసరఫరా శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
- ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపాటు
అయినప్పటికీ తాను వారిలా దిగజారి ఆరోపణలు చేయలేనన్నారు. తాను తమ అధ్యక్షుడి అనుమతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే ఎంతగా అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పౌరసరఫరా శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాము 19 ప్రశ్నలతో లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని విమర్శించారు. తాను చేసిన ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.