"దూకే ధైర్యమా... దేవర ముంగిట నువ్వెంత...!" ఎన్టీఆర్ 'దేవర' నుంచి 'ఫియర్ సాంగ్' ఇదిగో!
- ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర
- ఫియర్ సాంగ్ ను విడుదల చేసిన చిత్రబృందం
- అనిరుధ్ రవిచందర్ సంగీతం... రామజోగయ్యశాస్త్రి సాహిత్యం
- ఫియర్ సాంగ్ ను స్వయంగా ఆలపించిన అనిరుధ్
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షీనే టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.