ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఇన్ స్టా స్టేటస్ కు అర్థం అదేనా?
- త్వరలో తన జీవితంలోకి ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారంటూ ఇన్ స్టాలో వెల్లడించిన డార్లింగ్
- ఎట్టకేలకు తమ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హీరో ప్రభాస్ పోస్ట్
పెళ్లి చేసుకునే విషయంపై ప్రభాస్ ను గతంలో చాలామంది అడిగినా ఆయన సూటిగా జవాబివ్వలేదు. ఏటేటా తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. గతంలో హీరోయిన్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా బాహుబలి సినిమా తర్వాత అనుష్క కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోవడం కోసమే కొత్త సినిమాలు అంగీకరించలేదనే వార్తలు వెలువడ్డాయి.
అయితే, తామిద్దరం మంచి స్నేహితులమని ఇటు ప్రభాస్, అటు అనుష్క క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఆదిపురుష్ సినిమా తర్వాత వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ కావడంతో వీరి ప్రేమ నిజమేనని ఫ్యాన్స్ కూడా భావించారు. తర్వాత కొన్ని రోజులకు కృతి సనన్ వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ప్రభాస్, కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే ప్రచారానికి తెరపడింది. ప్రభాస్ ఇన్ స్టా స్టేటస్ తో హీరో పెళ్లి గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. ప్రభాస్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.