అల్లు అర్జున్ ప్రచారంపై ఆయన మామ ఏమన్నారంటే..
- తన స్నేహితుడి కోసమే ప్రచారం చేస్తున్నాడని చంద్రశేఖర్ రెడ్డి వివరణ
- దేశాన్ని, ప్రజలను ఒక్కటి చేసే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని వ్యాఖ్య
- కాంగ్రెస్ గెలుపు ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం
దేశ ప్రజల మద్దతు ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఉందని, గెలుపు తమదేనని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నానని వివరించారు. దేశాన్ని, దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలను ఒక్కటి చేసే శక్తి కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆరోపిస్తూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపడతారని జోస్యం చెప్పారు.