ఆ పాట అంత హిట్ అవుతుందని అనుకోలేదు: 'ఓం భీమ్ బుష్' మనీశ్ కుమార్
- ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'ఓం భీమ్ బుష్'
- దెయ్యం పాత్రలో మెప్పించిన మనీశ్ కుమార్
- వరుస అవకాశాలు వస్తున్నాయని వెల్లడి
- సరైన పాత్రల కోసం వెయిట్ చేస్తున్నానని వ్యాఖ్య
"నేను డాన్సర్ నీ .. అనుకోకుండా నాకు ఈ సినిమాలో దెయ్యం పాత్రను పోషించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో దెయ్యం మంచి డాన్సర్ కావడం వలన, ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమాలోని 'అణువణువు అలలెగసే .. తెలియని ఓ ఆనందమే' అనే పాట దెయ్యం పైనే ఉంటుంది. ఈ పాట చాలా పాప్యులర్ అయింది. ఇంత హిట్ అవుతుందని మాత్రం అనుకోలేదు. అర్జిత్ సింగ్ వాయిస్ చేసిన మేజిక్ అది" అని అన్నాడు.
'ఓం భీమ్ బుష్' సినిమా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాగే ఈ పాట కూడా నా కెరియర్ లో గుర్తుండిపోతుంది. ఈ సినిమా చేసిన దగ్గర నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. నాకు మరింత పేరు తీసుకొచ్చే పాత్రలను ఎంపిక చేసుకుందామని అనుకుంటున్నాను. అలాంటి ప్రాజెకుల కోసమే చూస్తున్నాను" అని చెప్పాడు.