వివేకా హత్యపై షర్మిల సంచలన ఆరోపణలు
- రూ.40 కోట్లు చేతులు మారాయన్న ఏపీసీసీ ప్రెసిడెంట్
- వైఎస్ అవినాశ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణ
- ఫోన్ కాల్స్, డబ్బులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని వెల్లడి
ఈ హత్యలో అవినాశ్ పాత్ర ఉందని తెలిశాక, హత్య జరగడానికి ముందు, ఆ తర్వాత ఆయన ఎవరికి ఫోన్ చేశారనే వివరాలూ బయటకొచ్చాయని షర్మిల వివరించారు. ఇంత స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. వివేకా హత్య జరిగాక ఘటనా స్థలంలో ఆధారాలు తుడిచేస్తుంటే అవినాశ్ రెడ్డి చూస్తూ ఉండిపోవడం వెనక కారణాలేంటని షర్మిల ప్రశ్నించారు.