ప్రియాంక గాంధీపై కాంగ్రెస్ పార్టీలో కుట్ర: ఆ పార్టీ బహిష్కృత నేత సంచలన వ్యాఖ్యలు
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలుతుందన్న ఆచార్య ప్రమోద్ కృష్ణమ్
- కుటుంబం, పార్టీలో ప్రియాంక గాంధీపై కుట్ర జరుగుతోందన్న మాజీ కాంగ్రెస్ నేత
- జూన్ 4 తర్వాత ప్రియాంక మద్దతుదారుల ఆవేదన అగ్నిపర్వతంలా విస్పోటనం చెందుతుందని వ్యాఖ్య
ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని తాను ముందే చెప్పానని, ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కుటుంబం, పార్టీలో జరుగుతున్న కుట్రకు బాధితురాలిగా మారారని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు.
రాహుల్ గాంధీకి పాకిస్థాన్‌లో ప్రజాదరణ, డిమాండ్ పెరుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాయ్‌బరేలీకి బదులుగా పాక్‌లోని రావల్పిండి నుంచి పోటీ చేస్తే బావుంటుందని తాను భావిస్తున్నానని అన్నారు.