'సితార' సినిమాను నేను అనుకున్నట్టుగా తీయలేకపోయాను .. కానీ ఆ సీన్ అంటే ఇష్టం: వంశీ
- 1984లో విడుదలైన 'సితార'
- 40 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా
- హీరోయిన్ గా రాధను అనుకున్నట్టు వెల్లడి
- సుమన్ ఒప్పుకోవడానికి కారణం బ్యానర్ అని వ్యాఖ్య
వంశీ మాట్లాడుతూ .. 'సితార' సినిమాను నేను అనుకున్నట్టుగా తీయలేకపోయాను అనే ఒక అసంతృప్తి ఉంది. 'మహల్లో కోకిల' అనే కథను నేను రాసుకున్నాను. రాసుకున్నట్టుగా తీయలేకపోయాను. అందుకు కారణం అప్పుడున్న పరిస్థితులే. ఆ సినిమాలో కొన్ని సీన్స్ బాగుంటాయి. రాజావారు చనిపోయినప్పుడు ఊళ్లో వాళ్లంతా చూడటానికి వస్తారు. ఆ జనంలోనే ఆయన చెల్లెలు ఉంటుంది. ఆమెను అంతకుముందు ఎవరూ చూడకపోవడం వలన, వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. ఆ సీన్ అద్భుతంగా వచ్చింది .. అదంటే నాకు ఇష్టం" అన్నారు.
" ఈ సినిమాకి ముందు నేను ఎవరో సుమన్ కి తెలియదు. ఈ బ్యానర్లో చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమా ఒప్పుకున్నాడు. ఇక హీరోయిన్ గా రాధ బాగుంటుందని ఏడిద నాగేశ్వరరావు అనుకున్నారు. ఆమె లక్ష రూపాయల పారితోషికం అడగడంతో, కొత్త అమ్మాయిని చూడమని చెప్పారు. అప్పుడు భానుప్రియ ఈ ప్రాజెక్టులోకి వచ్చింది" అని చెప్పారు.