కళింగ యుద్ధంతో ముడిపడిన 'మిరాయ్' .. గ్లింప్స్ రిలీజ్!
- తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న 'మిరాయ్'
- 'సూపర్ యోధ'గా కనిపించనున్న హీరో
- దర్శకత్వం వహిస్తున్న కార్తీక్ ఘట్టమనేని
- సంగీతాన్ని సమకూర్చుతున్న గౌర హరి
- 2025 ఏప్రిల్ 18న 7 భాషల్లో విడుదల
ఈ సినిమాకి 'మిరాయ్' అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రాచీన యుద్ధ విద్యలు తెలిసిన వ్యక్తిగా, డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్లో హీరో కనిపిస్తున్నాడు. అతణ్ణి ఒక 'సూపర్ యోధ'గానే పరిచయం చేశారు. 'హను మాన్' కి సంగీతాన్ని అందించిన గౌర హరినే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ కథ కళింగ యుద్ధంతో ముడిపడి నడిచేదిగా కనిపిస్తోంది. కళింగ యుద్ధం అనంతరం, పవిత్రమైనవిగా .. ప్రాచీనమైనవిగా చెప్పబడే 9 గ్రంథాలను కాపాడవలసిన బాధ్యత 9 మంది యోధులపై ఉంటుంది. ఆ గ్రంథాలకు ఏ వైపు నుంచి ఆపద ముంచుకొస్తుంది? అప్పుడు యోధుడైన హీరో ఏం చేస్తాడు? అనేదే కథ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, 3Dలోను విడుదల కానుండటం విశేషం.