షర్మిల బస్సు యాత్రలో వివేకా కూతురు సునీత.. అవినాశ్ రెడ్డిని ఓడించాలని పిలుపు
- కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల
- తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్న సునీత
- షర్మిలను ఎంపీ చేయాలనేదే తన తండ్రి చివరి కోరిక అని వెల్లడి
మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ కండువా వేసి ఇద్దరినీ కాంగ్రెస్ లోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ... జగన్, వైసీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టిన తనను జగన్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ తమకు దేవుడితో సమానమని... షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియంత జగన్ ను గద్దె దించాలని... కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని అన్నారు.