శ్రీకాంత్ నివాసానికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- నేడు (మార్చి 23) నటుడు శ్రీకాంత్ పుట్టినరోజు
- శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించిన చిరంజీవి
- సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్
ఇవాళ (మార్చి 23) శ్రీకాంత్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, చిరంజీవి తన సన్నిహితుడు శ్రీకాంత్ నివాసానికి వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించారు. ఆ కేక్ పై... "హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్... లవ్ ఫ్రమ్ అన్నయ్య" అని రాసి ఉంది.
ఈ సందర్భంగా శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.


