బీఆర్ఎస్-బీఎస్పీ మధ్య సీట్ల పంపకం పూర్తి.. నాగర్ కర్నూలు నుంచి బరిలోకి ప్రవీణ్‌కుమార్!
- హైదరాబాద్, నాగర్ కర్నూలు సీట్లను బీఎస్పీకి కేటాయించిన బీఆర్ఎస్
- మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ
- ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
తాజాగా, ఈ రోజు ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. పొత్తులో భాగంగా హైదరాబాద్, నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ అభ్యర్థులు పోటీచేస్తారు. ఈ రెండు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు బీఆర్ఎస్ నేతలు పూర్తి సహకారం అందిస్తారు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ బరిలోకి దిగుతుంది. కాగా, బీఆర్ఎస్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ తెలంగాణ చీఫ్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతారని సమాచారం.