విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ: రఘురామకృష్ణరాజు
- ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రఘురామ
- ఈసారి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశిస్తున్న వైనం
- నాకు టికెట్ ఇవ్వొద్దని విష్ణు చెబుతున్నట్టు సమాచారం ఉందని వెల్లడి
విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ అని వ్యాఖ్యానించారు. పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ విష్ణు అస్త్రాన్ని వాడారని వెల్లడించారు. నాకు టికెట్ లభించకుండా చేసేందుకు విష్ణువర్ధన్ ను ప్రయోగించింది జగన్ అని ఆరోపించారు.
విష్ణువర్ధన్ రెడ్డిది కదిరి... నాది నరసాపురం... నా నియోజకవర్గంతో విష్ణువర్ధన్ కు ఏం పని? నాకు టికెట్ ఇస్తే జగన్ కు భయం ఎందుకు? అని రఘురామ సూటిగా ప్రశ్నించారు.