కవిత మాట్లాడుతుంటే వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
- బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కూడా కవిత ఇలాగే మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్య
- కేసీఆర్ కేబినెట్లో గతంలో మహిళలు లేరు... కానీ కాంగ్రెస్ కేబినెట్లో మంత్రులకు ప్రాధాన్యత ఉందని వెల్లడి
- గతంలో తనకు ఇల్లే లేదన్న కవితకు ఇప్పుడు దుబాయ్‌లో కూడా ఇల్లు ఉందని గుర్తు చేసిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ వస్తోందన్నారు. తమ ప్రభుత్వ పథకాలలోనూ మహిళలకు ప్రాధాన్యత ఉన్న విషయం గుర్తించాలన్నారు. రూ.500కే సిలిండర్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాలు మహిళలకు సంబంధించినవే అన్నారు. గతంలో తనకూ ఇల్లే లేదని చెప్పిన కవితకు ఇప్పుడు దుబాయ్‌లో కూడా ఇళ్లు ఉందన్నారు. దీనిని ప్రజలంతా గుర్తిస్తున్నారన్నారు. మహిళల గురించి ఎవరు మాట్లాడినా సంతోషమేనని... కానీ అర్థవంతంగా ఉండాలని సూచించారు.